ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..! 1 d ago
TG: ఈ-ఫార్ములా కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెర్చ్ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి పొందింది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలుపై దర్యాప్తు చేస్తున్నారు. HMDA ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలను ఏసీబీ సేకరించనుంది.